Hyderabad, అక్టోబర్ 8 -- బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి 2022లో వచ్చిన 'ఝుండ్‌' సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాన్షు అలియాస్ బాబు రవి సింగ్ ఛెత్రి కన్నుమూశాడు. 21 ఏళ్ల ప్రియాన్షు నాగ్‌పూర్ లోని జరిపట్కా ప్రాంతంలో బుధవారం (అక్టోబర్ 8) తెల్లవారుజామున జరిగిన తాగుబోతుల గొడవలో తన స్నేహితుడి చేతిలో దారుణంగా హత్యకు గురైనట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. నిందితుడు ధ్రువ్ లాల్ బహదూర్ సాహు (20)ను పోలీసులు అరెస్టు చేశారు.

అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో నటించిన ఝుండ్ మూవీ మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమాలో ప్రియాన్షు కీలక పాత్ర పోషించాడు. తాజా ఘటన గురించి పోలీస్ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్రియాన్షు, ధ్రువ్ స్నేహితులు. ఇద్దరూ తరచుగా కలిసి మందు తాగేవాళ్లు.

"మంగళవారం (అక్టోబర్ 7) అర్ధరాత్రి తర్వాత ప్రియాన్షు, ఛెత్రి సాహు ...