భారతదేశం, డిసెంబర్ 4 -- టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ పేరు సంపాదించుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త ఆర్థిక ఇబ్బందులపై స్పందించింది. గతేడాది వచ్చిన 'బడే మియాన్ చోటే మియాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన తర్వాత ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై నటి, జాకీ భార్య అయిన రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. తమ నిర్మాణ సంస్థను మూసివేయలేదని, పరిస్థితిని మీడియాలో అతిగా చేసి చూపించారని ఆమె స్పష్టం చేసింది.

'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ రకుల్ ప్రీత్ సింగ్ తమ కుటుంబం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను వివరించింది. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మూతపడలేదని క్లారిటీ ఇచ్చింది.

"మనం ఈ రోజు క్లిక్-బైట్ (ఇంటర్నెట్‌లో క్లిక్స్ కోసం ఆకర...