Hyderabad, ఏప్రిల్ 21 -- తెలుగులో కామెడీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత సంపూర్ణేష్ బాబు మరో సినిమాతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు.

అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరించే సినిమా 'సోదరా' అని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్‌ కూడా మరో హీరోగా నటించాడు. సోదరా సినిమాకు మన్‌ మోహన్‌ మేనం పల్లి దర్శకత్వం వహించారు. క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చంద్ర చగంలా సోదరా మూవీని నిర్మించారు.

సంపూర్ణేష్ బాబు, సంజోష్‌లు హీరోలుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్బంగా సోదరా హీరోల్లో ఒకరైన సంజోష్ ...