Hyderabad, జూలై 26 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా చిత్రం హరి హర వీరమల్లు. జూలై 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు తొలిరోజు ఇండియాలో రూ. 40 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో పవన్ కల్యాణ్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

కానీ, రెండో రోజు అయిన శుక్రవారం హర హర వీరమల్లు కలెక్షన్స్ అమాంతం పడిపోయాయి. ఏకంగా 80 నుంచి 85 శాతం వరకు అన్ని చోట్ల హరిహర వీరమల్లు కలెక్షన్స్ పడిపోయినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది. వివిధ భాషల్లో విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్రం హిందీ మాట్లాడే ప్రాంతాల నుంచే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది.

ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం హరి హర వీర మల్లు సినిమాకు శుక్రవారం (జూలై 25) భారతదే...