భారతదేశం, ఆగస్టు 27 -- అమెరికా మొత్తం 50 శాతం సుంకం ఆగస్టు 27 బుధవారం నుండి అమల్లోకి వచ్చాయి. రష్యా నుంచి చమురు కొంటున్నామనే అక్కసుతో అదనపు సుంకాలు విధించింది. అమెరికాకు వెళ్లే కొన్ని వస్తువులు ఇప్పుడు 50 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు నష్టాన్ని కలిగిస్తుందని చూపించే అనేక గణాంకాలు బయటకు వచ్చాయి. కచ్చితంగా కొంత ప్రభావం ఉంటుంది. ఇప్పటికే సుంకాల అమలుపై యూఎస్ భారతదేశానికి నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

బుధవారం నుంచి భారతదేశం నుండి వెళ్లే వస్తువులపై 50 శాతం సుంకాలను విధించాలని అమెరికా నిర్ణయించడంతో, దుస్తులు, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాల నుండి ఆక్వా రంగం, కార్పెట్లు, ఫర్నిచర్ వరకు తక్కువ మార్జిన్, శ్రమతో కూడిన వస్తువుల ఎగుమతులు అమెరికన్ మార్కెట్లో సుంకాలను ఎదుర్కొనున్నాయి. భారతదేశంలో తక్కువ నైపుణ్యం కలిగిన ఉద...