Hyderabad, ఏప్రిల్ 15 -- అమర్ నాథ్ యాత్ర చేయాలని ప్రతి శివ భక్తుడు కోరుకుంటారు. జీవిత కాలంలో ఒక్కసారి అయినా అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే వారి సంఖ్య ఎక్కువే. అక్కడ కొలువై ఉన్న శివుడిని చూసి తమ కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు భక్తులు. అందుకే ఈ ప్రయాణం ఎంత కష్టమైనదైనా కూడా ఆనందంగా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ప్రతి ఏడాది అమర్ నాథ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. అమర్ నాథ్ యాత్రకు ఈ ఏడాది ఏప్రిల్ 14న రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.

అమర్ నాథ్ యాత్రకు వెళ్ళేందుకు ముందుగా మీ పేరును నమోదు చేసుకోవాలి. అమర్ నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు అధికారిక వెబ్‌సైటు https://jksasb.nic.in/ ని ఇందుకోసం సందర్శించాలి. భక్తులు ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో కూడా తమ పేరును నమోదు చేసుకోవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళు ఆన్ లైన్లో నమోదు చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ కోసం ఒక ...