భారతదేశం, నవంబర్ 28 -- ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో రెండో విడత ల్యాండ్‌ పూలింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7 గ్రామాల పరిధిలో మరో 16,666.57 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏకు అనుమతించే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.

కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి,పెదపరిమి గ్రామాల పరిధిలో సీఆర్డీఏ భూసమీకరణ చేపట్టనుంది.మొదటి దశలో రైతుల నుంచి 34 వేల ఎకరాలను సమీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా చేపట్టబోయే భూసేకరణలో 16 వేలను సేకరించటం సేకరిస్తారు. మొత్తం ప్రభుత్వ భూమి, రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమితో కలిపి మొత్తం 70 వేల ఎకరాల భూమిలో రాజధాని నిర్మాణం చేస్తారు.

ఇవాళ మొత్తం 25 అంశాల అజెండాతో కేబినెట్ భేటీ అయింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేష...