భారతదేశం, ఏప్రిల్ 26 -- అమరావతి ప్రాంతంలో కొన్ని గ్రామాలకు ముంపు ముప్పు ఉంది. కృష్ణా వరదలు వచ్చినప్పుడు, భారీ వర్షాలు కురిసినప్పుడు పలు గ్రామాలు రోజుల తరబడి నీటిలోనే నానుతుంటాయి. అందుకే ఆయా గ్రామాల్లో భూముల ధరలు తక్కువగా ఉంటాయి. వాటిని రియల్టర్లు కల్పతరువులుగా మార్చుకుంటున్నారు. పంటలు పండని భూములంటూ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. వాటిలో వెంచర్లు వేసి, ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ముఖ్యమైన 10 అంశాలు ఇలా ఉన్నాయి.

1.పల్నాడు జిల్లా అమరావతి, పెదకూరపాడు, గుంటూరు జిల్లా తాడికొండ మండలాల్లో వాగు ముంపు పరిధిలో వందల ఎకరాల్లో లే అవుట్లు వెలుస్తున్నాయి.

2.ప్రస్తుతం వేసవి కావడంతో వాగుల్లో నీరు లేనందున రోడ్లు వేసి ప్లాట్లుగా విభజించి అందమైన బ్రోచర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు.

3.వర్షాకాలంలో ఈ ప్లా...