భారతదేశం, ఏప్రిల్ 16 -- ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. మే 2న అమరావతిలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ...రాజధాని పునర్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. రాజధానిలో రాష్ట్ర సచివాలయ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. సచివాలయానికి చెందిన 4 టవర్లు, హెచ్‌వోడీ ఆఫీస్ టవర్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. హెచ్‌వోడీ టవర్‌ నిర్మాణానికి రూ.1,126 కోట్లకు టెండర్‌ ఆహ్వానించగా, సచివాలయానికి సంబంధించి 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లు, సచివాలయం 3,4 టవర్ల కోసం రూ.1,664 కోట్లతో టెండర్లు పిలిచారు. మొత్తంగా 5 టవర్లను రూ.4,668 కోట్ల పనులకు టెండర్లను ఆహ్వానించారు. మే 1న సచివాలయం, హెచ్‍వోడీ టవర్లకు టెక్నికల్ బిడ్లు తెరవనున్నారు.

పాలవాగు దక్షిణాన ఏపీ ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్, హెచ్వోడీ కార్యాలయాల నిర్మాణం కోసం టెండర్ల...