భారతదేశం, మే 22 -- ఏపీలో అమరావతి పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. తెలంగాణలో సచివాలయ భవనాన్ని రూ.600కోట్లతో కేసీఆర్‌ నిర్మిస్తే.. ఏపీలో 12వేల మంది ఉద్యోగులకు అవసరమైన సచివాలయం ఇప్పటికే ఉండగా మరో భవనాన్ని రూ.4వేల కోట్లతో నిర్మించాల్సిన అవసరం ఏమిటన్నారు. రాజధానికి అవసరమైన భవనాలను 500ఎకరాల్లో విజయవాడ-గుంటూరు మధ్యలో కట్టాలని డిమాండ్ చేశారు.

స్కాముల్లో పరాకాష్టగా అమరావతి పేరుతో దోపిడి జరుగుతోందని జగన్‌ ఆరోపించారు. అమరావతి కోసం 2018లో టెండర్లు పిలిచారని అప్పుడు రూ. 41,170 కోట్ల పనుల్లో 2019 నాటికి రూ. 5,587కోట్లు పనులు పూర్తి అయ్యాయని, 35,583 కోట్ల పనులు మిగిలి ఉన్నాయని, ఇప్పుడు మళ్లీ ఈ టెండర్లను రద్దు చేసి అంచనాలు పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు.

జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేసి మరీ అమ...