భారతదేశం, జనవరి 7 -- తుళ్లూరు మండలం వడ్లమాను గ్రామంలో రాజధాని ప్రాంతానికి సంబంధించిన రెండో దశ భూ సమీకరణ ప్రక్రియను అధికారికంగా మంత్రి నారాయణ ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం సేకరించిన భూమిని వేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా సముదాయంతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రాబోయే మూడేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.

'రాజధాని ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ ఉపశమనం కోసం స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అభ్యర్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేను మాట్లాడాను. ఆయన ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. జనవరి 6 వరకు అర్హత కలిగిన రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తాం. ఈ ప్రయోజనం రూ.1.5 లక్షల వరకు ఉన్న రుణాలకు వర్తిస్తుంది.' అని ...