Andhrapradesh, జూలై 8 -- రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశించిన సమయానికే తమ నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సీఆర్డీఏ పరిధిలో భూములు కేటాయించిన వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రైవేటు కార్పోరేట్ సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో నిర్మాణ ప్రగతి పై ముఖ్యమంత్రి చర్చించారు.

భూములు కేటాయించిన సంస్థల ప్రతినిధులతో కలిసి ఈ తరహా సమావేశం తొలిసారి నిర్వహించారు. భూములు తీసుకున్న 61 సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భూములు కేటాయించిన సంస్థల ప్రతినిధులు కొందరు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. భూములు తీసుకున్న ఆయా సంస్థల ప్రతినిధులు ఎప్పటిలోగా తమ నిర్మ...