భారతదేశం, డిసెంబర్ 11 -- ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో 44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిలో లోక్‌భవన్‌, అసెంబ్లీ దర్బార్‌ హాల్‌, గవర్నర్‌ కార్యాలయం, రెండు గెస్ట్‌ హౌస్‌లు, స్టాఫ్‌ క్వార్టర్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు 32 శాతం పెరగడంపై కేబినెట్ సంతృప్తిని వ్యక్తం చేసింది. భవిష్యత్తులోనూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని కేబినెట్ నిర్ణయించింది.

పత్తి కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమ...