భారతదేశం, అక్టోబర్ 9 -- అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులు కొత్త నగర అభివృద్ధి ప్రయోజనాలను పంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సీఆర్‌డీఏ అథారిటీ 53వ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన, భూమిని ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వదగిన ప్లాట్ల నమోదును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో 18 అజెండా అంశాలపై చర్చించారు.

'రాజధాని నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించాం. భూములు ఇచ్చిన రైతులే ముందుగా అభివృద్ధి ఫలాలను అనుభవించాలి. వారికి చెల్లింపుల్లో జాప్యం చేయకూడదు. భూములు సేకరించిన గ్రామాల్లోనే తిరిగి ఇచ్చే ప్లాట్లను కేటాయించాలి. సచివాలయ టవర్లు, ఇతర భవనాలు త్వరగా పూర్తయ్యేలా పనులు మరింత ఊపందుకుంటాయి.' అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

వెస్ట్ బైపాస్ రోడ్డు పనులను వెంటనే చేపట్టి, సాంకేతిక సమస్యలను పరిష్కరించి, కా...