భారతదేశం, మే 2 -- అమరావతి అనేది ప్రజల రాజధాని...ఆంధ్రప్రదేశ్‌ తలరాతను మార్చే రాజధాని. ఒకఉన్నత లక్ష్యంతో కొత్త రాష్ట్రంలో నాడు కొత్త రాజధానిని సంకల్పించారు.

* అమరావతి రాజధాని నిర్మాణాన్ని తలపెట్టినపుడు విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న వ్యవసాయ భూమిని ప్రభుత్వం భూసమీకరణలో సేకరించింది. భూసమీకరణలో భూములు ఇచ్చిన వారిలో 32 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బిసిలు 14 శాతం, రెడ్డి సామాజికవర్గం 20 శాతం, కమ్మ వర్గం 18 శాతం, కాపులు 9 శాతం, ముస్లిం వర్గం 3 శాతం ఉన్నారు.

* అమరావతి రాజధాని 8603 చ.కి పరిధిలో రాజధాని ప్రాంతంగా గుర్తించారు. ఇందులో 217 చ.కీ పరిధిలో రాజధాని నగరం నిర్మిస్తారు. ఇందులో 16.9 చ.కీ పరిథిలో కోర్ క్యాపిటల్ ఉంటుంది.

* ఏపీసీఆర్డీఏ యాక్ట్ 2014 ప్రకారం అమరావతి రాజధానిగా ఏర్పాటు అయ్యింది.

* రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వేల ఎకరాలు ఇచ్చిన దేశంలోనే ఒ...