Andhrapradesh, జూన్ 24 -- ఏపీ రాజధాని అమరావతిలో మరికొన్ని సంస్థలకు భూకేటాయింపులు జరగనున్నాయి. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి నారాయణ వెల్లడించారు.

రాజ‌ధాని భూకేటాయింపుల స‌బ్ క‌మిటీ 18వ స‌మావేశం జ‌రిగింది. మొత్తం 16 అంశాల‌కు గాను 12 అంశాల‌కు స‌బ్ క‌మిటీ ఆమోదం తెలిపింది. వీటిలో 2014-19 మ‌ధ్య కాలంలో భూములు కేటాయించిన ప‌లు సంస్థ‌ల‌కు తిరిగి కేటాయింపుల్లో మార్పులు చేస్తూ సబ్ క‌మిటీ ఆమోదం తెలిపింది.

సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ కు రెండు ఎకరాలు అలాగే జియలాజిక‌ల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు రెండు ఎకరాలు,స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు ఐదు ఎకరాలు, ఏపీ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు మూడు ఎకరాలు కేటాయింపుల‌ను కొన‌సాగిస్తూ ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయ‌ణ చెప్పారు.

ఈ నాలుగు సంస్థలకు గతంలో కేట...