భారతదేశం, డిసెంబర్ 25 -- రాష్ట్ర రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గురువారం వెంకటపాలెంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.

ప్రజా రాజధాని అమరావతిలో అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచం అంతా గుర్తించేలా అమరావతిని తీర్చిదిద్దటమే తమ ధ్యేయమన్నారు. స్పూర్తిదాత వాజ్ పేయి స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మించడానికి ఇక్కడి రైతుల త్యాగమే స్పూర్తి అని చెప్పుకొచ్చారు.

"చరిత్ర గుర్తించే విధంగా అటల్ బిహారీ వాజ్ పేయికి ఘనమైన నివాళి ఇవ్వాలనే స్మృతి వనం నిర్మిస్తున్నాం. అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర బీజేపీ ప్రారంభించింది. 26 జిల్లా క...