భారతదేశం, ఏప్రిల్ 24 -- రాజ‌ధాని అమ‌రావ‌తి పున‌ర్మిర్మాణ ప‌నుల ప్రారంభానికి శ‌ర‌వేగంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చేతుల మీదుగా అమ‌రావ‌తి ప‌నులు రీలాంచ్ చేసేందుకు ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మే రెండో తేదీన ప్ర‌ధాని మోడీ అమ‌రావ‌తికి రానున్నారు.

అమరావతిలో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం చేసేందుకు అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్నాయి. తాజాగా పుర‌పాల‌క మంత్రి నారాయ‌ణ అమ‌రావ‌తి లో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ఏర్పాట్లు ప‌ర్య‌వేక్షించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల్గొనే స‌భావేదిక వ‌ద్ద‌కు వెళ్లేందుకు అవ‌స‌ర‌మైన రోడ్ల ను ప‌రిశీలించారు. సుమారు రెండు గంట‌ల పాటు సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు.

గుంటూరు రేంజ్ ఐజీ స‌ర్వశ్రేష్ట త్రిపాఠి,గుంటూరు జిల్లా ఎస్పీ స‌తీష్ కుమార్ తో క‌లిసి మంత్రి నారాయ‌ణ ప‌లు రోడ్ల‌ను ప‌రిశీలించారు. 2014-19...