భారతదేశం, జనవరి 6 -- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో పవిత్ర హారతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టీటీడీ ఉన్నతాధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గంగా నది తీరంలోని కాశీలో, ఉజ్జయినిలో నిర్వహిస్తున్న పవిత్ర హారతులతో పాటు ఇతర ప్రాంతాలలో ఎక్కడెక్కడ పవిత్ర హారతులు ఇస్తున్నారో టీటీడీ అధికారుల కమిటీ పరిశీలించి నివేదిక రూపొందించాలని సూచించారు. వేద మంత్రోచ్ఛారణలు, దీపాల కాంతులు, ఘంటానాదాల మధ్య పవిత్ర హారతి కార్యక్రమం భక్తులకు మరింత దైవనానుభూతిని పెంచుతుందని, టీటీడీ అధికారుల కమిటీ లోతుగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.

ఇప్పటికే పలు రాష్ట్రాల రాజధానులలో టీటీడీ శ్రీవారి ...