భారతదేశం, జనవరి 26 -- గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో మెుదటిసారి వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు లోకేశ్‌, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన మైదానంలో వేడుకలు జరిగాయి. పరేడ్‌లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. 22 శకటాలను ప్రదర్శించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించే రాజధాని అమరావతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మెుదటిసారిగా నిర్వహించింది.

అమరావతి వేలాది మంది రైతుల త్యాగ ఫలితం అని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. ఇది ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కలలకు సజీవ చిహ్నం. రాజధాని కోసం స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చిన రైతుల ధైర్యం, ...