భారతదేశం, ఏప్రిల్ 28 -- ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల నిర్మాణంపై మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాజధానిలో 41 సంస్థలకు 300 ఎకరాలు పైగా కేటాయించినా ఇప్పటి వరకు పనులు ముందుకు సాగలేదని చెబుతోంది.

అమరావతి నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేసి 3474 రోజులు గడిచినా ఒక్క సంస్థ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాలేదని ఆరోపిస్తున్నారు. ఆరు నెలల్లోగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల పనులు పూర్తి చేసేలా మోదీ ఆదేశాలు ఇవ్వాలని వాటిని నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను గ్రాంటుగా ప్రకటించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీని సీపీఎం రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2వ తేదిన విచ్చేస్తు...