భారతదేశం, సెప్టెంబర్ 1 -- అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై ఇప్పటికే 50 ఎకరాలు కేటాయించింది సీఆర్డీఏ. ప్రభుత్వ సంస్థగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(ఏక్యూసీసీ) అయింది.

వివిధ రంగాల్లో పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటం వ్యాలీ సేవలు ఉండనున్నాయి. 2 వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్ , 5కె గేట్స్ క్యాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ ముందుకు వచ్చింది. భద్రమైన నెట్‌వర్కింగ్, అధునాతన కూలింగ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరాను క్వాంటం వ్యాలీకి ప్రభుత్వం అందించనుంది.

చదరపు అడుగుకు రూ.30కే అద్దె చెల్లించే ప్రాతిపదికన రాయితీపై ఐబీఎం సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణ...