భారతదేశం, జనవరి 8 -- ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై వీరిద్దరూ చర్చించుకున్నారు.

అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. దీని వల్ల రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందని చెప్పారు. అలాగే ఇటీవల ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీ రామ్ జీ పథకంలోని కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు...