Andhrapradesh, సెప్టెంబర్ 17 -- అభ్యంతరాల్లేని భూములను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖపై కలెక్టర్ల సదస్సులో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..."రెవెన్యూ విభాగానికి వచ్చే ఫిర్యాదుల్లో 70 శాతం మేర ఆర్ఓఆర్ కు సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయి. గత పాలకుల తప్పులతో ఈ స్థాయిలో రెవెన్యూ, భూ వివాదాల ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ధృవీకరణ పత్రాలకు సంబంధించిన ఫిర్యాదులు, భూములు ఇలా వేర్వేరు అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి" అని తెలిపారు.

"భూముల్ని కాజేయడానికి 22ఏలో పెట్టి బ్లాక్ మెయిల్ చేశారు. రీసర్వే చేసి ఈ రికార్డులను సరి చేయాలి. నిర్దేశిత గడువులోగా వీటిని ప్రక్షాళన చేయాలి. వివిధ ధృవీకరణ పత్రాలకు సంబంధించి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు. కులం ఎవరిదీ మారిపోద...