Hyderabad, జూలై 28 -- ఓ హీరోను అభిమానించడం వేరు. కానీ అలాంటి హీరోకి తన మొత్తం ఆస్తిని రాసివ్వడం ఎప్పుడైనా విన్నారా? కానీ బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితం ఎప్పుడూ ఒక సినిమా స్క్రిప్ట్‌లానే ఉంటుంది. ఓ సినిమా కథను తలపించేలా, ఒక అభిమాని ఏకంగా రూ.72 కోట్ల ఆస్తిని తనకు రాసిచ్చిన విషయాన్ని ఈ నటుడు వెల్లడించాడు. ఆసక్తికరమైన మలుపు ఏంటంటే, ఆ మొత్తాన్ని అతడు తిరిగి ఆ అభిమాని కుటుంబానికి ఇచ్చేశాడు.

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈ మధ్య 'కర్లీ టేల్స్'తో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 2018లో నిషా పాటిల్ అనే తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఒక అభిమాని తన ఆస్తి మొత్తాన్ని సంజయ్ దత్‌కు రాసిచ్చిన సంఘటన గురించి ఇందులో అతన్ని అడిగారు. దీనిపై సంజయ్ సింపుల్ గా స్పందిస్తూ.. "నేను దానిని ఆమె కుటుంబానికి తిరిగి ఇచ్చేశాను" అని చెప్పడం గమనార్హం.

62 ఏళ్ల ముంబైకి చెందిన ఆ గృహిణి, ...