భారతదేశం, నవంబర్ 21 -- రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌లో మెరిసిన బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే ఇటీవల వచ్చిన దుల్కర్ సల్మాన్ కాంత మూవీలో నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

తాజాగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఆన్‌స్క్రీన్ హీరోగా చేస్తున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు.

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నవంబర్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

-చాలా ఆనందంగా అనిపించింది. ప...