భారతదేశం, ఏప్రిల్ 18 -- గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా పార్ట్ -బిలో పెట్టిన 18 లక్షల ఎకరాల్లో.. ఆరు నుంచి ఏడు లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయని.. ఈ భూములకు భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపూర్‌లో మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి భూభారతి పైలెట్ ప్రాజెక్టును పొంగులేటి ప్రారంభించారు. త‌ర్వాత ఆదిలాబాద్ జిల్లా భోర‌జ్ మండ‌లం పుసాయ్ గ్రామంలో భూభారతి చట్టంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. 'పేదల కన్నీటిని తూడ్చేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. ఎన్నికలకు ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేము ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించి.. ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఇందిరమ్...