భారతదేశం, మే 24 -- ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ సందీప్ వంగా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స్పిరిట్ మూవీలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది క‌న్ఫామ్ అయ్యింది. ఈ పాన్ వ‌ర‌ల్డ్‌ మూవీలో ప్ర‌భాస్‌కు జోడీగా యానిమ‌ల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి న‌టించ‌బోతున్న‌ది. ఈ విష‌యాన్ని శ‌నివారం ట్విట్ట‌ర్ ద్వారా డైరెక్ట‌ర్‌ సందీప్ వంగా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు. స్పిరిట్‌లో త్రిప్తి డిమ్రి ఫిమేల్ లీడ్‌గా న‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు. సందీప్ వంగా ట్వీట్‌లో త్రిప్తి డిమ్రి పేరు ఎనిమిది భాష‌ల్లో క‌నిపిస్తోంది. భార‌తీయ భాష‌ల‌తో పాటు కొరియ‌న్‌, చైనీస్‌ లాంగ్వేజెస్‌లో త్రిప్తి డిమ్రి పేరును రివీల్ చేయ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

స్పిరిట్ మూవీలో త‌న‌కు హీరోయిన్‌గా ఛాన్స్ ద‌క్క‌డంపై త్రిప్తి డిమ్రి కూడా ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. ఈ జ‌ర్నీలో మ‌రోసారి న‌న్ను న‌మ్మినందుకు మీకు రుణ‌ప‌డి ఉం...