భారతదేశం, నవంబర్ 1 -- హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్ చేసిన కాంచన ఫ్రాంఛైజీ నుంచి మరో సినిమా రాబోతోంది. రాఘవ లారెన్స్ డైరెక్షన్ లోనే కాంచన 4 మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పూజ హెగ్డే, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ ఇద్దరు అందాల భామలు కాంచన 4లో ఫీమేల్ లీడ్ రోల్స్ ప్లే చేయనున్నారు.

కాంచన 4 సినిమాలో పూజ హెగ్డే, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ ప్రొడక్షన్ హౌస్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే గత ఏడాది జూన్లో మృణాల్ ఠాకూర్ ఈ హర్రర్ కామెడీ ఫ్రాంచైజీలో భాగం అవుతాడని పుకార్లు వచ్చాయి. కానీ అదంతా అబద్దమని తేలిపోయింది. ఈ సినిమాలో పూజా హెగ్డే, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో యాక్ట్ చేయడంతో పాటు లారెన్స్ దర్శకుడు, ప్రొడ్యూసర...