భారతదేశం, జూలై 8 -- మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం ఓటీటీ రిలీజ్ కు సమయం ఆసన్నమవుతోంది. ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. డిజిటల్ ప్రీమియర్ కు ఈ సినిమా రెడీ అవుతోంది. ఈ తెలుగు యాక్షన్ డ్రామా సినిమా మే 30న థియేటర్లలో రిలీజైంది.

యాక్షన్ థ్రిల్లర్ భైరవం సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. ఈ సినిమా జూలై 18న ఓటీటీలో రిలీజ్ కానుంది. జీ5 ఓటీటీలో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అవుతుంది. ఈ మేరకు జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. హైదరాబాద్ లోని ఐకానిక్ ప్లేస్ లపై భైరవం పోస్టర్లతో ఈ వీడియో రూపొందించింది. చివరగా హుస్సేన్ సాగర్ వాటర్ పై జూలై 18 భైరవం మూవీ అని వీడియో ముగించింది.

భైరవం సినిమా రెండు భాషల్లో డిజిటల్ స్ట్ర...