Hyderabad, సెప్టెంబర్ 4 -- కూలీ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. అందరూ ఊహించినట్లే సెప్టెంబర్ 11 నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని బుధవారం (సెప్టెంబర్ 4) ప్రైమ్ వీడియో తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా అనౌన్స్ చేసింది. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ (Coolie) ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఆ లెక్కన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో డిజిటల్ ప్రీమియర్ అనౌన్స్‌మెంట్ చేసింది. "దేవా, సైమన్, దహా సాగాతో ఉత్సాహంగా ఉండటానికి సిద్ధంగా ఉండండి. కూలీ సెప్టెంబర్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో" అనే క్యాప్షన్ తో ఇటు ఎక్స్, అటు ఇన్‌స్టాగ్రామ్ లో ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది.

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ...