భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఓటీటీలో హారర్ థ్రిల్లర్ జానర్ లవర్స్ కు ఓ గుడ్ న్యూస్. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి హనీ అనే ఓ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ నెల 6న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ కానుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సన్ నెక్ట్స్ ఓటీటీ వెల్లడించింది.

నవీన్ చంద్ర, బిగ్ బాస్ ఫేమ్ దివి, దివ్య పిళ్లై, రాజా రవీంద్రలాంటి వాళ్లు నటించిన హారర్ థ్రిల్లర్ హనీ (Honey). ఈ సినిమాను ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సన్ నెక్ట్స్ ఓటీటీ శుక్రవారం (ఫిబ్రవరి 20) వెల్లడించింది. నిజానికి ముందే ఈ వార్త బయటకు వచ్చినా.. తాజాగా ఆ ఓటీటీ అధికారికంగా అనౌన్స్ చేసింది. "కొన్ని భయాలు ఎప్పటికీ వదలి వెళ్లవు.. అవి ఫాలో అవుతుంటాయి.. తమిళం, తెలుగులో ఫిబ్రవరి 27 నుంచి కేవలం సన్ ...