భారతదేశం, నవంబర్ 25 -- రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీ 'మాస్ జాతర'. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. మాస్ జాతర మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్, రిలీజ్ డేట్ వివరాలు మీ కోసం.

రవితేజ 75వ సినిమాగా తెరకెక్కిన మాస్ జాతర ఓటీటీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. వచ్చే శుక్రవారం అంటే నవంబర్ 28 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ లో అందుబాటులో ఉండనుంది ఈ మూవీ. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కమింగ్ ఫ్రైడే అని మాస్ జాతర అప్ డేట్ ఉంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ మాస్ జాతర ఓటీటీ ప్లే అవనుంది.

రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా వచ్చిన మాస్ జాతర.. ఆయన కెరీర్ లోనే దారుణమైన కల...