భారతదేశం, నవంబర్ 10 -- ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ 'డ్యూడ్' ఓటీటీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ వీడింది. ఈ సినిమా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది ఆ ప్లాట్ ఫామ్. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి, 2025 లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

జెన్ జెడ్ రొమాంటిక్ స్టోరీగా గుర్తింపు తెచ్చుకున్న డ్యూడ్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. నవంబర్ 14 నుంచి డ్యూడ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇవాళ (నవంబర్ 10) వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డ్యూడ్ మూవీ అందుబాటులో ఉండనుంది.

డ్యూడ్...