భారతదేశం, నవంబర్ 15 -- అఫీషియల్.. మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా పేరు 'వారణాసి'. ఈవెంట్ స్టార్ట్ కావడానికి ముందే అక్కడి స్క్రీన్ లపై ఈ పేరు వచ్చింది. ఇప్పుడు అఫీషియల్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇవాళ (నవంబర్ 15) జరుగుతున్న గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్లో ఫ్యాన్స్ కు రాజమౌళి అదిరే సర్ ప్రైజ్ ఇచ్చారు. ట్రైలర్ విజువల్ ట్రీట్ గా ఉంది.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్లో 100 అడుగుల స్క్రీన్ పై ప్రదర్శించారు. ఇది విజువల్ ట్రీట్ గా ఉంది. అంటార్టికా మంచు పర్వతాలు, ఆఫ్రికా అడవులు, లంకా నగరం, వారణాసి.. ఇలా వేర్వేరు ప్రదేశాలను దాటుతూ చివర్లో ఎద్దుపై మహేష్ బాబు చేతిలో త్రిశూలం పట్టుకుని రావడం కనిపించింది. ఆ తర్వాత వారణాసి అని టైటిల్ డిస్ ప్లే అయింది.

వారణాసి సినిమా నుంచి ఇప్పటి...