భారతదేశం, డిసెంబర్ 24 -- భారతదేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా దూసుకెళుతున్న టాటా మోటార్స్.. ఈవీ మార్కెట్​లో తన పట్టును మరింత పటిష్టం చేసుకునేందుకు సిద్ధమైంది. 2026 క్యాలెండర్ ఇయర్​లో మార్కెట్లోకి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను లాంచ్​ చేయనున్నట్టు కంపెనీ ఇటీవలే ధృవీకరించింది. ఇందులో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'సీయెరా ఈవీ'తో పాటు పాపులర్ మోడల్ 'పంచ్ ఈవీ' ఫేస్‌లిఫ్ట్, అలాగే ప్రీమియం సెగ్మెంట్‌లో 'అవిన్యా' వంటి ఎలక్ట్రిక్​ కార్లు ఉండనున్నాయి.

టాటా మోటార్స్ తన దీర్ఘకాలిక లక్ష్యాలను వివరిస్తూ.. 2030 నాటికి భారత మార్కెట్లో ఐదు కొత్త ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే పైన పేర్కొన్న మూడు మోడళ్లపై స్పష్టత రాగా, మిగిలిన రెండు మోడళ్ల వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

1990 దశకంలో టాప్​ మోడల్​గా నిలిచిన సియె...