భారతదేశం, మే 8 -- ఫ‌హాద్ ఫాజిల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన అప‌రాధి మూవీ గురువారం ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీలో సౌబీన్ షాహిర్‌, ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. మ‌ల‌యాళం మూవీ ఇరుల్‌కు అనువాదంగా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

అలెక్స్ (సౌబిన్ షాహిర్‌) ఓ రైట‌ర్ క‌మ్ బిజినెస్‌మెన్‌. అత‌డు రాసిన న‌వ‌ల పెద్ద హిట్ట‌వుతుంది. అర్చ‌న ( ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్‌) అనే లాయ‌ర్‌ను ప్రేమిస్తాడు అలెక్స్‌. ఆమెతో క‌లిసి స‌ర్‌ప్రైజ్ వీకెండ్‌ట్రిప్ ప్లాన్ చేస్తాడు. ఆ ట్రిప్‌లోనే అర్చ‌న‌కు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయాల‌ని అనుకుంటాడు. ఈ ట్రిప్‌కు ఫోన్స్ తీసుకురాకూడ‌ద‌ని అలెక్స్‌, అర్చ‌న కండీష‌న్స్ పెట్టుకుంటారు.

ట్రిప్‌కు వెళుతోండ‌గా...వ‌ర్షం కార‌ణంగా ఓ కొండ ప్రాంతంలో అలెక్స్ కారు ట...