భారతదేశం, జూన్ 27 -- మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో రూ.50 వేల అప్పు తీర్చేందుకు ఓ వ్యక్తి తన భార్యను స్నేహితుడికి అమ్మేశాడు. ఆమెపై ఆ స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఇండోర్ లోని మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే, నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు దాన్ని 'జీరో' ఎఫ్ఐఆర్ గా నమోదు చేసి తదుపరి చర్యల కోసం ధార్ పోలీసులకు పంపించారు. కాగ్నిజబుల్ నేరానికి సంబంధించి ఫిర్యాదు వచ్చినప్పుడు పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ అయినా 'జీరో' ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధార్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలోని కన్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధిత మహిళ భర్త నివసిస్తుండగా, అతని భార్య వేరుగా ఇండోర్ లో నివసిస్తోంది. తన భర్త జూదగాడని, ఆ అలవాటు కారణంగా అతని అప్పు పెరుగుత...