భారతదేశం, డిసెంబర్ 2 -- ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. కల్కి 2898 ఏడీ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ సంక్రాంతి బరిలో నిలుస్తోంది. జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమాకు అమెరికాలో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

ప్రభాస్ ది రాజా సాబ్ సందడి అప్పుడే మొదలైంది. నిజానికి అమెరికాలోనూ డిసెంబర్ 4 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సినీమార్క్ థియేటర్స్ మాత్రం రెండు రోజుల ముందుగానే ఈ బుకింగ్స్ మొదలుపెట్టడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఈసారి సంక్రాంతికి చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, దళపతి విజయ్ జన నాయగన్ లాంటి సినిమాలతో ది రాజా సాబ్ పోటీ పడనుంది. ఇండియాలో ఇప్ప...