భారతదేశం, జనవరి 28 -- 'బోర్డర్ 2' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండగా.. అందులో నటించిన దిల్జీత్ దోసాంజ్ (Diljit Dosanjh) తన నటనకు గాను ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ.. మొదటి 'బోర్డర్' సినిమానాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. అప్పట్లో తన దగ్గర సినిమా చూసేందుకు డబ్బులు లేవని, ఇప్పుడు అదే సినిమా సీక్వెల్‌లో నటించడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నాడు.

బుధవారం (జనవరి 28) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో దిల్జీత్ దోసాంజ్ మాట్లాడుతూ.. "బోర్డర్ సినిమా వచ్చినప్పుడు దేశమంతా దాని గురించే మాట్లాడుకునేవారు. అప్పట్లో మా ఇంట్లో థియేటర్‌కు వెళ్లనిచ్చేవారు కాదు. పైగా మా దగ్గర థియేటర్‌లో సినిమా చూసేంత డబ్బులు కూడా లేవు. అందుకే ఆ సినిమా టీవీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి, టీవీలోనే చూశాను. అలా రెండు మూడు సార్లు చూసు...