Hyderabad, ఏప్రిల్ 24 -- సివిల్స్ ర్యాంకర్లందరూ చదువుల్లో టాప్ అనే భావన ఎంతో మందిలో ఉంటుంది. కేవలం బాగా చదివేవారు, టెన్త్, ఇంటర్లో టాపర్లు మాత్రమే సివిల్స్ ర్యాంకర్లుగా నిలుస్తారని అపోహ కూడా ఎంతో మందిలో ఉంది. చదువుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారే సివిల్స్ లో కూడా ర్యాంకులు సాధిస్తారని అనుకునే వారికి పామూరు సురేష్ జీవితం ఒక ఉదాహరణ. సాధారణ విద్యార్థులు కూడా కష్టపడితే సివిల్స్ ర్యాంకర్లుగా మారొచ్చని నిరూపించాడు ఈ సాధారణ యువకుడు.

పామూరు సురేష్‌ది తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామం. అతడు టెన్త్ వరకు అత్యంత సాధారణ విద్యార్థి. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిపోయాడు. దాంతో ఇంటర్ వదిలేసి డిప్లమో చేశాడు. అప్పట్లో అతడికి చదువు రాదని ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు ఇంటి నుంచి బయట ఎన్నో అవమానాలు కూ...