Hyderabad, జూలై 29 -- ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విపరీతమైన వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ మూవీని యూట్యూబ్ లో విడుదల చేస్తున్నట్లు ఆమిర్ ప్రకటించాడు. అయితే ఈ సినిమాను యూట్యూబ్ లో విడుదల చేయబోమని గతంలో ఆమిర్ సినిమా విడుదల సమయంలో చెప్పాడు. అప్పుడు ఎందుకు అబద్ధం చెప్పానో ఇప్పుడు ఆమిర్ వివరించాడు.

సితారే జమీన్ పర్ మూవీని తన యూట్యూబ్ ఛానెల్లోకి తీసుకొస్తున్నట్లు మంగళవారం (జులై 29) మీడియాకు చెప్పాడు ఆమిర్ ఖాన్. ఈ సందర్భంగానే తాను గతంలో అబద్ధం చెప్పినట్లు అంగీకరించాడు. తన సినిమా యూట్యూబ్ లో విడుదల కాదని గతంలో అబద్ధం చెప్పానని, ఇప్పుడు అందరికీ చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నట్లు ఆమిర్ అన్నాడు.

అప్పట్లో థియేట్రికల్ బిజినెస్ ను కాపాడుకోవాల్సి వచ్చింది.. నేను సినిమాతో నా కెరీర్ ప్రా...