భారతదేశం, జనవరి 5 -- లెజెండరీ తమిళ నిర్మాత శరవణన్ సూర్య మణి అలియాస్ ఎవిఎం శరవణన్ లేదా కేవలం ఎం శరవణన్ గురించి మాట్లాడుతూ రజినీకాంత్ ఎమోషనల్ అయ్యారు. తన 86 వ పుట్టినరోజు తర్వాత డిసెంబర్ 4, 2025న శరవణన్ కన్నుమూశారు. చెన్నైలోని ఏవీ మేయప్పన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఆదివారం(జనవరి 4) జరిగిన కార్యక్రమంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి శరవణన్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.

శరవణన్ గురించి మాట్లాడుతుండగా రజినీకాంత్ భావోద్వేగానికి గురయ్యాడు. ''ఆయనతో 11 సినిమాలు చేశా. శరవణన్ తన కార్యాలయంలో కూర్చొని అనేక విజయాలను అందించిన వ్యక్తి. సినిమాకు మించి వ్యక్తిగతంగా నాకు చాలా సన్నిహితుడు'' అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు.

ప్రముఖ నిర్మాత శరవణన్ తనకు ఇచ్చిన సలహాను కూడా రజనీకాంత్ వెల్లడించారు. ''శివాజీ (2007) తర్వాత నా వయసు పెరిగేకొద్దీ బిజీగా ఉండాలని ఆయన చెప్పారు. ప...