భారతదేశం, డిసెంబర్ 31 -- మద్యం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ, "ఎప్పుడో ఒకసారి తాగితే ఏమవుతుంది? మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిదే కదా!" అనే అపోహ చాలా మందిలో ఉంది. సోషల్ డ్రింకింగ్ లేదా అప్పుడప్పుడు తాగడం వల్ల ప్రాణాపాయం ఉండదని భావించే వారిని హెచ్చరిస్తూ గుజరాత్‌కు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

వడోదరకు చెందిన ప్రివెంటివ్ అండ్ డయాగ్నోస్టిక్ రేడియాలజిస్ట్ డాక్టర్ హర్ష్ వ్యాస్, ఒక 28 ఏళ్ల యువకుడి కాలేయానికి (Liver) సంబంధించిన అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌ను పంచుకున్నారు. ఆ నివేదిక చూసిన వైద్యులే విస్తుపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

డాక్టర్ వ్యాస్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక షాకింగ్ ఇమేజ్‌ను షేర్ చేస్తూ.. "ఇది కేవలం అప్పుడప్పుడు మాత్రమే మద్యం తాగుతానని చెప...