భారతదేశం, డిసెంబర్ 11 -- ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన సింహాచలానికి సూపర్ జర్నీ అనుభూతి కలగనుంది. ఎందుకంటే విశాఖపట్నం నుంచి కొత్త డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ ప్రారంభమైంది. విశాఖపట్నంలో పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ గురువారం అధికారికంగా ప్రారంభమైందని పర్యాటక శాఖ అధికారులు ధృవీకరించారు. ఈ సేవ నగర పర్యాటకులకు, సింహాచలం అప్పన్న స్వామి ఆలయం దర్శనం వెళ్లే భక్తులకు గొప్ప సౌకర్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.

ఈ సర్వీస్‌ను ప్రవేశపెట్టడంతో పర్యాటకాన్ని పెంచాలని, ఈ ప్రాంతంలోని ఆధ్యాత్మిక ప్రదేశాలలో సులభంగా చేరుకోవడానికి వీలు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో చాలాసార్లు ఈ డబుల్ డెక్కర్ బస్సు ట్రయన్ రన్ చేస్తూ కనిపించింది. ఆర్కే బీచ్ నుండి సింహాచలం వరకు మార్గాన్ని కూడా ప్రయత్నించిం...