భారతదేశం, జనవరి 14 -- మహిళా ఐఏఎస్ అధికారిపై ఇటీవల ఓ న్యూస్ ఛానల్ వార్త పబ్లిష్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కొన్ని రోజులుగా తెలంగాణలో చర్చ నడుస్తోంది. ప్రభుత్వం ఈ కేసుపై దర్యాప్తు కోసం హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. తాజాగా జర్నలిస్టుల అరెస్టు విషయంపై సజ్జనార్ మాట్లాడారు. మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించారు.

రిపోర్టర్లు ఎందుకు పారిపోతున్నారని సీపీ సజ్జనార్ ప్రశ్నించారు. అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని బ్యాంకాక్ పారిపోయేందుకు ప్రయత్నిస్తే అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. మరో రిపోర్టర్ విచారణకు వస్తానని, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారన్నారు. అందుకే వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని తెలిపారు. ఓ టీవీ ఛానెల్ సీఈవో ఎక్...