భారతదేశం, మే 23 -- మీకు కానీ లేదా మీ కుటుంబంలో ఎవరికైనా క్రమం తప్పకుండా వైద్య సహాయం అవసరమా? లేదా భవిష్యత్తులో వైద్య ఖర్చులను తగ్గించాలని భావిస్తున్నారా? అయితే, అపోలో ఎస్బీఐ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ ను ఎంపిక చేసుకోండి. ఇది డాక్టర్ కన్సల్టేషన్లు, రోగనిర్ధారణ పరీక్షలు, ఔషధాల ఖర్చును తగ్గిస్తుంది. ఈ క్రెడిట్ కార్డుతో పొదుపు 25% వరకు ఉంటుంది. ఈ కార్డు ఫీచర్లు, ప్రయోజనాలను ఇతర వివరాలను ఇక్కడ చూడండి.

అపోలో ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్ అనేది ఎస్బీఐ కార్డ్ భాగస్వామ్యంతో అపోలో 24|7 ప్రారంభించిన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు. ఇది అపోలో ఎకోసిస్టమ్ అంతటా ఆరోగ్య సంరక్షణ, వెల్ నెస్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ తో పాటు భోజనం, వినోదం, ప్రయాణం వంటి ఆరోగ్య సంరక్షణేతర ఖర్చులపై రివార్డులను కూడా అందిస్తుంది.

అపోల...