భారతదేశం, జనవరి 16 -- సిలికాన్ వాల్యీ ఆఫ్​ ఇండియా బెంగళూరులో సొంతింటి కల కంటున్న సామాన్యుడికి చేదు నిజం ఎదురవుతోంది! ఇళ్లు కొనేవారు గతంలో కంటే ఇప్పుడు చాలా చిన్న అపార్ట్‌మెంట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కానీ ధరలు మాత్రం పైపైకి వెళుతున్నాయి. పెరుగుతున్న భూమి ధరలు, నిర్మాణ వ్యయాన్ని తట్టుకోవడానికి డెవలపర్లు అపార్ట్‌మెంట్‌లోని 'కార్పెట్ ఏరియా'ను (నిజంగా మనం వాడుకునే స్థలం) తగ్గించేస్తున్నారు. తద్వారా ధరను సామాన్యుడికి అందుబాటులో ఉంచినట్లు కనిపిస్తున్నా, వాస్తవానికి కొనుగోలుదారులు తక్కువ స్థలానికి ఎక్కువ ధర చెల్లిస్తున్నారు.

ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ 'నోబ్రోకర్' విడుదల చేసిన డేటా ప్రకారం.. 2024లో బెంగళూరులో సగటు అపార్ట్‌మెంట్ సైజు 1,094 చదరపు అడుగులు ఉండగా.. 2025 నాటికి అది 1,008 చదరపు అడుగులకు పడిపోయింది. అంటే ఏడాది కాలంలోనే ద...