భారతదేశం, నవంబర్ 5 -- ప్రజల విద్యుత్ అవ‌స‌రాల‌ను తీర్చడంతో పాటు నాణ్యమైన విద్యుత్‌ను నిరంత‌రాయం స‌ర‌ఫ‌రా చేయ‌డానికే స‌బ్ స్టేష‌న్ల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్పష్టం చేశారు. అన‌కాప‌ల్లి జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా అన‌కాప‌ల్లిలో రూ.5.50 కోట్లతో నిర్మించనున్న సూప‌రింటెండెంట్ ఇంజనీర్ కార్యాల‌యం భ‌వానికి ఎంపీ సీఎం ర‌మేష్, ఎమ్మెల్యే కొణ‌తాల రామ‌కృష్ణతో క‌లిసి మంత్రి గొట్టిపాటి శంకుస్థాప‌న చేశారు.

అనంత‌రం మాడుగుల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కే.కోట‌పాడు మండ‌లం చౌడువాడ‌తో పాటు మాడుగుల మండ‌లం కింత‌లిలో నిర్మించిన 3311 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల‌ను మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప్రారంభించారు. ఆ త‌రువాత చౌడువాడ గ్రామంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి మాట్లాడుతూ అన‌కాప‌ల్లి జిల్లాకు 10 స‌బ్ స్టేష‌న్లు మంజూ...