Tirumalaa,andhrapradesh, జూలై 19 -- తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగస్తులను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది.

సస్పెండ్ అయిన వారిలో బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్), ఎస్. రోసి (స్టాప్ నర్స్) బర్డ్ ఆసుపత్రి, ఎం.ప్రేమావతి, (గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ బర్డ్ ఆసుపత్రి), అదేవిధంగా డా.జి.అసుంత (ఎస్వీ ఆయుర్వేద) ఉన్నారు.

సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు ,వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం జరిగిందని టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

సదరు ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని గుర్తించామని టీటీడీ వివరించింది. హిందూ ధార్మిక సంస...